ETV Bharat / state

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం - మూడు రోజుల పాటు వర్షాలు - AP RAIN ALERT

మూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడుకు వర్ష సూచన - దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

AP Rain Alert
AP Rain Alert (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2025, 9:03 AM IST

AP Rain Alert: మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​, తమిళనాడుల్లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్​లోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో సైతం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

డేంజర్​లో ఆంధ్రప్రదేశ్​ - 44 శాతం భూభాగంపై విపత్తుల ప్రభావం

జి మాడుగులలో 5 డిగ్రీలు- మరో ఐదు రోజులపాటు తీవ్రమైన చలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.