చిత్తూరు జిల్లా పాకాల మండలంలో పశువులో పోటీల్లో పాల్గొనే ఎద్దు మృతిచెందింది. ఆ గ్రామానికి చెందిన వారంతా ఆ ఎద్దుకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలో పశువుల పండగను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు తరహాలో ఈ పండగ ఉంటుంది. ఇందులో పాల్గొనే ఎద్దులను ఏడాది నుంచే సిద్ధం చేస్తుంటారు. అలా ప్రతి సంవత్సరం పశువుల పండగలో పాల్గొనే పాకాల మండలం వడ్డేపల్లి పంచాయతీ కావిలివారిపల్లెకు చెందిన ఎద్దు ఒకటి చనిపోయింది. దీనికి ఆ గ్రామస్తులంతా కలిసి మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి