శ్రీలంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్లోని రైల్వే స్టేషన్లలో ఉగ్రదాడులు జరగనున్నాయంటూ అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తప్పుడు సమాచారమిచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినా.... రద్దీ ఎక్కువగా ఉండే రైల్వేస్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయానికి నిత్యం దేశ విదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది భక్తులను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ లో బాంబ్ స్కాడ్ ముమ్మర తనిఖీలు నిర్వహించింది. వివిధ రైళ్లలో వస్తున్న ప్రయాణికులను.. అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి