ETV Bharat / state

ఓవైపు ఘర్షణలు.. మరో పక్క సందడిగా నామినేషన్లు - చిత్తూరు జిల్లాలో నాలుగో దశ నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి దశ ఓటింగ్ ఫలితాలు వెలువడగా...మిగత దశలకోసం అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కొన్నికొన్ని ప్రాంతాలలో ఘర్షణలుకాగా..అధికారులే గెలిచిన వారికి మద్దతు ప్రకటిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన నేతలను..కొంతమంది గ్రామస్థులు వారి పార్టీ గుర్తులతోనే వినూత్నంగా సన్మానిస్తున్నారు.

fourth stage nominations at chittore district
సందడిగా నామినేషన్లు
author img

By

Published : Feb 12, 2021, 3:37 PM IST

సందడిగా నామినేషన్లు
ఎంపీడీఓ నిర్బంధం..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు..అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గానికి అండగా నిలిచారని ఓ అధికారిని అక్కడి గ్రామస్థులు నిర్బంధించారు . చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండల అభివృద్ది అధికారి రాజశేఖరరెడ్డిని పీవీపురం గ్రామస్థులు నిర్బంధించారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల తొమ్మిదిన పీవీపురం గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో భాస్కరరెడ్డి, టెండూల్కర్ పోటీపడగా... టెండూల్కర్ గెలుపొందారు. ఇందులో ఓ వర్గం వారికి సహకరించారని ..మరో వర్గీయులు ఎంపీడీఓని నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ..అతనిని విడిపించి గ్రామస్థులకు సర్ధిచెప్పారు.

23 గ్రామాలకు..28 నామినేషన్లు

చిత్తూరు జిల్లాలో నాలుగో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. తుది జాబితా విడుదల రోజు అవ్వడంతో ..ఎన్నికల బరిలో నిలిచేందుకు వెళ్లిన అభ్యర్థులతో కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. నాలుగో దశలో 14 మండలాల పరిధిలోని 375 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్జి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచర్ల మండలంలో రెండో రోజు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అతితక్కువ మంది నామినేషన్లు వేశారు. పులిచర్ల మండలంలో 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా కేవలం 28 మంది మాత్రమే నామినేషన్లు వేశారు.

160 గ్రామ పంచాయతీలకు 610 నామినేషన్లు

సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని 160 గ్రామ పంచాయతీలకు 610 నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 121 గ్రామ పంచాయతీలకు 462 చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాల్లో 172, తిరుపతి గ్రామీణ పరిధిలో 34 మంది సర్పంచు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

అక్కడి పంచాయతీ ఎన్నికలకు తెదేపా దూరం

చిత్తూరు జిల్లాలో తిరుపతి శాసనసభ నియోజకవర్గం శెట్టిపల్లి పంచాయతీ ఎన్నికలకు తెదేపా మద్దతు అభ్యర్థులు దూరంగా ఉండనున్నట్లు...తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు తెలిపారు. అభివృద్ధి విషయమై..గ్రామస్థుల కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థుల అభిప్రాయాన్ని గౌరవమిస్తామన్నారు. ఈ మేరకు తెదేపా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిర్ణయం ప్రకటించారు.

వంకాయలతో సత్కారం..

చిత్తూరు జిల్లాలో పుత్తూరు మండలం తడుకులో ఓ సర్పంచ్​ను అక్కడి గ్రామస్థులు వినూత్నంగా సత్కరించారు. సర్పంచ్ తెదేపా మద్దతుదారు పి.వెంకటేష్​ని వంకాయలతో విభిన్నంగా సన్మానించారు

బారులు తీరిన అభ్యర్థులు
నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. మౌని అమావాస్య శుభ దినంగా పరిగణించి నామినేషన్ వేసేందుకు సర్పంచి, వార్డు సభ్యులు అభ్యర్థులు తరలివెళ్లారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, రేణిగుంట మండల కార్యాలయం ఎదుట బారులు తీరారు. అభ్యర్థులకు మద్దతుగా గ్రామీణ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో తరలి వస్తుండడంతో ప్రధాన రహదారులు జనసంద్రంగా దర్శనమిచ్చాయి.

వృద్ధుల నామినేషన్లు..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వృద్ధులు నామినేషన్లు వేశారు. శ్రీకాళహస్తి మండలం రెడ్డిపల్లి పంచాయతీకి చెందిన సుబ్బమ్మ(75), వార్డు సభ్యురాలుగా నామినేషన్ దాఖలు చేశారు. ఏర్పేడు మండలం మునగలపాళ్లెంకు చెందిన రాజమ్మ(70)సర్పంచ్ అభ్యర్థి బరిలో దిగి నామపత్రాలు సమర్పించారు. పంచాయతీ పోరులో వృద్దులు పోటీచేయడంతో ఎన్నికలు ఆసక్తిగా మారనున్నాయి.

ఇదీ చూడండి. పంచాయతీ ఎన్నికలపై.. ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్: ఎస్‌ఈసీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.