చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా పూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శాప్ మాజీఛైర్మన్ పీ.ఆర్ మోహన్ డిమాండ్ చేశారు. ఆలయానికి వచ్చిన సభాపతి తమ్మినేని సీతారాంకు జరిగిన అపచారం గురించి తెలియజేసేందుకు ప్రయత్నించగా పీ.ఆర్ మోహన్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
స్పీకర్ గారూ... మా గోడు వినండి... అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. సమస్యను వివరించేందుకు ప్రయత్నించిన తనను అడ్డుకోవటం తగదని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.