ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అగరాల ఈశ్వర్ రెడ్డి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1967లో తిరుపతి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982 సెప్టెంబర్ నుంచి 1983 జనవరి వరకు శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
సీఎం జగన్ సంతాపం
మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి మృతిపట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఈశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీచదవండి.చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ పంచనామా నివేదిక