చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. తండ్రీకుమారుడు కారులో ఆసుపత్రికి వెళ్తుండగా.. గుడపల్లి వద్దకు రాగా.. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. మృతులు వి.కోట మండలం పట్రపల్లికి చెందిన సుబ్బప్ప, కాంతప్పగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: అనూష మృతదేహానికి కాసేపట్లో శవపరీక్ష