ETV Bharat / state

లోపట మంత్రుల సమీక్ష.. బయట రైతు సంఘం నాయకుల అరెస్టు

చిత్తూరు జిల్లా జడ్పీ సమావేశ మందిరం వద్ద రైతు సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పథకాలపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా అక్కడకు చేరుకున్న రైతులను పోలీసులు నిలువరించారు. మామిడికి గిట్టుబాటు కోసం మంత్రులకు వినతి పత్రం అందజేస్తామని చెప్పగా.. పోలీసులు అమనుమతించలేదు. దీంతో జడ్పీ భవనం ముందు రైతలు బైఠాయించగా.. వారిని అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

farmers leaders arrested
రైతు సంఘం నాయకుల అరెస్టు
author img

By

Published : Jun 24, 2021, 7:19 AM IST

మామిడికి గిట్టు బాటు ధర కల్పించే విషయమై ప్రజా ప్రతినిధులను కలవడానికి యత్నించిన రైతు సంఘం నాయకుల్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి అధికారులతో ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో అక్కడికి చేరుకున్న రైతు సంఘం నాయకులు తమను లోపలికి అనుమతిస్తే మంత్రులను కలసి మామిడి గిట్టు బాటు ధరలపై వినతి పత్రం అందజేస్తామని కోరారు. దానికి పోలీసులు అనుమతించ లేదు. దీంతో జడ్పీ భవనం ఎదుట రైతు సంఘం నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. సమావేశం జరగుతుండటంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ.. సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ

పెట్రో ధరల పెరుగుదల.. ఒక్కో ఎకరాపై రూ.3వేల వరకు భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.