చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని బైరెడ్డిపల్లె మండలం పెద్ద చల్లారపల్లె గ్రామంలో ఇంటి స్థలాల సేకరణ వివాదాస్పదం అయింది. ఖాళీగా ఉన్న ఎకరాలో కొంత మంది సాగు చేసుకుంటున్నారు. పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కోసం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెళ్లారు. కానీ తహసీల్దార్ ఎదుట సాగుదారులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు.
ఇవీ చూడండి... : కొవిడ్ బారిన తితిదే ఉద్యోగులు...అప్రమత్తమైన అధికారులు