ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వేపేరి గ్రామానికి చెందిన ఖాసీం పొలం దున్నేందుకు ట్రాక్టర్‌పై వెళ్లాడు. పొలం దున్నుతుండగా కిందకు జారిన కరెంట్ తీగలు ట్రాక్టర్‌పై పడ్డాయి. వాటిని పక్కకు తీద్దామని చేత్తో పట్టుకోగానే విద్యుత్ షాక్ తగిలి..అక్కడికక్కడే ఖాసీం మృతి చెందాడు.
భర్త ఎంతసేపటికీ రాకపోవటంతో పొలానికి వెళ్లిన భార్యకు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఖాసీం కనిపించాడు. వెంటనే స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇవీ చదవండి...