తిరుమలలో ఓ యువతిపై ఎలుగుబంటి దాడి చేసింది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా, మద్దిమడుగుకు చెందిన విజయలక్మీ అనే యువతి స్నానం చేసేందుకు గోగర్బం జలాశయంలోకి దిగింది. ఈ సమయంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంటి యువతిని తీవ్రంగా గాయపరిచింది. కేకలు వినిపించటంతో సమీపంలో ఉన్న మఠాలవారు ఘటనాస్థలానికి వెళ్లారు. బాధితురాలను అశ్విని ఆసుపత్రికి తరలించారు. తాను ఇంటి నుంచి పారిపోయి తిరుమలకు వచ్చినట్టు విజయలక్ష్మీ తెలిపింది. బాధితురాలిని తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పరామర్శించారు. అటవీ ప్రాంతంలోకి భక్తులు ఎవరూ ప్రవేశించకూడదని ధర్మారెడ్డి సూచించారు.
ఇదీ చదవండి:ఆంధ్ర సరిహద్దులో ఏనుగు మృతి