ETV Bharat / state

Elephants Attack: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. పంట పొలాలు ధ్వంసం - మొగలపూడిలో ఏనుగుల సంచారం

elephants attack on crop: చిత్తూరు జిల్లాలోని పొలాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పొలాలపై దాడులు చేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా మొగలమూడి సమీపంలో ఏనుగులు తిష్ఠవేశాయి. గజరాజుల సంచారంతో సమీప గ్రామాల ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల నుంచి పంటలను రక్షించాలని కోరుతున్నారు.

elephants attack on crop
చిత్తూరు జిల్లాలోని పొలాల్లో ఏనుగుల బీభత్సం
author img

By

Published : Mar 14, 2022, 10:40 AM IST

Updated : Mar 14, 2022, 10:51 AM IST

చిత్తూరు జిల్లాలోని పొలాల్లో ఏనుగుల బీభత్సం

elephants attack on crop: చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రేణిగుంట మండలం మొగలమూడిలో పొలాలపై గజరాజులు దాడి చేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా మొగలమూడి సమీపంలోని అటవీ ప్రాంతంలో తిష్ఠవేసిన ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించేందుకు ప్రహరీలను, ఇనుప కంచెలను ధ్వంసం చేశాయి.

"నోటికొచ్చిన పైరుపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. మూడు రోజులుగా 3 ఎకరాల్లో పంటలను పూర్తిగా ధ్వంసం చేసేశాయి. పంటపైనే మేము ఆధారపడి జీవిస్తున్నాం. మంటలు వేస్తున్నా, టపాసులు కాల్చినా ఏనుగులు వెళ్లడం లేదు. ఏమీ చేయలేకపోతున్నాం. చెరుకు పంట అంతా ధ్వంసమైపోయింది. మా పొలంలో 60 టన్నుల చెరుకు పంట వచ్చేది. ఏనుగులు తొక్కేయడం వల్ల పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు తోటలోకి వెళ్లాలన్నా... ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం వేస్తోంది. దయచేసి మాకు సాయం చేయండి" -రైతులు

గజరాజుల సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఏనుగులు గుంపు కోసం అన్వేషిస్తున్నారు. ఏనుగుల నుంచి పంటలను రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కుటుంబాన్ని పగబట్టిన పాము..? ఎన్ని సార్లు కాటేసిందో తెలిస్తే షాకే..!!

Last Updated : Mar 14, 2022, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.