గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ఊపయోగపడుతుందని తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ అన్నారు. తిరుపతిలోని తారకరామా క్రీడా మైదానంలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలకు విశేష స్పందన లభించింది. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీతో పాటు సిద్ధార్థ కళాశాలల ఛైర్మన్ అశోక రాజు బహుమతులు ప్రదానం చేశారు. యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏటా క్రమం తప్పకుండా ఈనాడు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు.
ఇదీ చదవండి :