ఆధునిక యుగంలోనూ సమాన అవకాశాలు పొందటంలో మహిళలకున్న అవరోధాలేంటన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు తిరుపతి వేదికగా ఈటీవీ భారత్-ఈనాడు మహిళా ఇష్ఠాగోష్టి నిర్వహించాయి. విభిన్న రంగాల్లో పేరుగాంచిన మహిళలు... వారి జీవిత అనుభవాలతో ఇతరుల్లో స్ఫూర్తి నింపేలా కార్యక్రమాన్ని రూపొందించింది. నగరంలోని రాష్ట్రీయ సేవా సమితి- రాస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి దువ్వూరు జమున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యాంకింగ్, వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలను పలు రంగాలకు చెందిన మహిళలు వివరించారు.
ఇదీచదవండి.