మూడు సంవత్సరాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జనవరిలో అమ్మఒడి పథకం ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ పథకానికి 6 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. మంత్రి సురేష్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నూతనంగా ఏర్పడిన తితిదే పాలకమండలి పరిపాలనలో మార్పులకు నాంది పలకాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇదీ చదవండి