జాతీయ రహదారిపై నీరు నిలిచి పోవటం వలన స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుచానూరు ఫ్లైఓవర్ పక్కన జాతీయ రహదారిపై ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు నిలిచిపోయింది. తిరుచానూరు, పద్మావతి పురం స్థానికులు కొద్దిరోజులుగా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘం నాయకులు.. 5 గంటల పాటు ఆ నీటిలోనే కూర్చుని తమ నిరసన తెలియజేశారు. తిరుచానూరు పోలీసులు, పద్మావతి పురం అధికారులు అక్కడికి చేరుకుని విద్యార్థి నాయకులకు సర్ది చెప్పారు. అధికారులు హామీ ఇవ్వడంతో.. విద్యార్థి నాయకులు ఆందోళనను విరమించారు.
ఇదీ చదవండి: