చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జస్టిస్ రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి వెనుక రాజకీయ కోణం లేదని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం చేశారు. పండ్ల బండి దగ్గర జరిగిన వివాదమే ఘర్షణకు దారితీసినట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు.
ప్రతాప్‌రెడ్డి, కుమార్‌రెడ్డి సహా నలుగురు నిందితులను గుర్తించామని, మరో ఇద్దరి వివరాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు. బాధితుని నుంచి ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదూ అందలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు విచారణ జరిపిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: