చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో దారుణం జరిగింది. ఓ యువతిని హత్య చేసిన యువకుడు...తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆగ్రహించిన గ్రామస్తుల రాళ్లదాడితో...యువకుడు చనిపోయాడు. యువతిని కొంతకాలంగా ప్రేమపేరుతో చిన్నా వేధిస్తున్నాడని...పోలీసులు వెల్లడించారు.
ప్రేమను అంగీకరించని సుష్మిత...చిన్నాపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీంతో ఆగ్రహించిన చిన్నా..ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని కత్తితో హత్య చేసి...తాను గొంతు కోసుకున్నాడని వివరించారు. చిన్నాపై రాళ్లదాడిపైనా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: దారుణం: భార్య, కుమారుడిపై గొడ్డలితో వ్యక్తి దాడి..భార్య మృతి