కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పేదప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పనిలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ప్రభుత్వం నిత్యావసర సరకులు, ఆర్థిక సాయం అందించినా... ఇంకా వారు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. పేద ప్రజలను ఆదుకోవడానికి మేమున్నామంటూ కొంతమంది దాతలు ముందుకొస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన సామాజిక కార్యకర్త నాగార్జున బాబు... అలియాస్ గాంధీ తొమ్మిది రోజులుగా పేదలకు అవసరమైన నిత్యావసర సరకులు అందజేస్తున్నారు.
ఆదివారం భారీ సంఖ్యలో 300 మందికి 700 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరకులు అందజేశారు. మదనపల్లి ఎమ్మెల్యే వీటిని అందజేశారు. పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు పటాన్ ఖాదర్ ఖాన్... లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రతిరోజు భోజనం తయారు చేసి... పేదలు నివసించే ప్రాంతంలో పంపిణీ చేస్తున్నారు. కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాస్ పేదలకు నిత్య అన్నదానం చేస్తున్నారు.
ఇదీ చదవండీ... 'ప్రతి జిల్లాలో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి'