తిరుపతి హథీరాంజీ మఠం అధికారి మిశ్రాను బాధ్యతల నుంచి తప్పిస్తూ... దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మఠం సెక్యూరిటీ గార్డు బసవరాజు ఆత్మహత్య కేసులో ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంది. మూడు నెలల క్రితం మఠం సెక్యూరిటీ గార్డు బసవరాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనకు మఠం మహంతు అర్జున్ దాస్, అధికారి మిశ్రా కారణమని మరణవాంగ్మూలం నమోదైంది. ఈ వాంగ్మూలం ఆధారంగా తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో 60 ఏళ్ల పైబడిన వారి సేవలు వద్దంటూ 72 ఏళ్ల మిశ్రాను దేవాదాయశాఖ తొలగించింది.
ఇదీ చదవండి: