ETV Bharat / state

భార్యాభర్తలను విడదీస్తారా..! ఒకే చోట బదిలీలకు డిమాండ్.. రణరంగంగా మారిన ఆందోళన.. - ఆంధ్రా వార్తలు

Teacher's Couple Concern: తెలంగాణలో బదిలీల విషయంలో ఉపాధ్యాయ దంపతులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్​ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మౌనదీక్షగా ప్రారంభమైన ధర్నా తరువాత ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వెంటనే అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించడంతో.. ఉపాధ్యాయ దంపతులు ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని బలవంతంగా అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Spouse Teachers Dharna
Spouse Teachers Dharna
author img

By

Published : Jan 21, 2023, 6:08 PM IST

Spouse Teachers Dharna: భార్య భర్తలు ఒకే చోట పని చేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఉపాద్యాయ దంపతులు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి రణరంగంగా మారింది. లక్డీకాపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌస్ ఫోరమ్ పిలుపునిచ్చింది. ఉపాధ్యాయ దంపతులు చాలా మంది ధర్నాకు హాజరయ్యారు.

తరువాత ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన ఉపాధ్యాయ దంపతులు.. పిల్లలతో సహా కమిషనర్ కార్యాలయం రోడ్డుపై బైఠాయించి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ఉపాధ్యాయ దంపతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులలో చిన్నారులపై సైతం పోలీసులు దారుణంగా ప్రవర్తించడంతో.. పిల్లలు, వారి తల్లిదండ్రులు విలపించారు.

మరో పక్క కొంతమంది పోలీసులు చిన్నారులను చేరదీసి.. వారి తల్లిదండ్రులను ఈడ్చుకుంటూ వాహనాలలో తోసివేశారు. దీంతో గంటపైగా అరెస్ట్​ల పరంపర కొనసాగడంతో.. కొంతమంది ఉపాధ్యాయులకు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 19 జిల్లాల్లో బదిలీలకు అనుమతించిన ప్రభుత్వం.. మరో 13జిల్లాల్లో ఆపేయడం న్యాయమా అని ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నించారు.

వేర్వేరు ప్రదేశాల్లో విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రదేశాల్లో పనిచేయడం వల్ల తమ పిల్లలను సరిగా చూసుకోలేకపోతున్నామని ఉపాధ్యాయ దంపతులు వాపోయారు. జీవో317 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకొని తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని.. లేదంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.

"భార్యాభర్తలు ఒకే దగ్గర ఉంటేనే మంచిగా పని చేస్తారని సీఎం కేసీఆర్​ గతంలో అన్నారు. ఆ విధంగా బదిలీలు కూడా ఉంటాయని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇంత ఆలస్యం అవుతుంది. దీనికి ఆయన వెనుక ఉన్న అధికారులే ఈ విషయంలో అడ్డుతగులుతున్నారని అనిపిస్తోంది. భార్య పిల్లలను వదిలేసి రోజుకు150 కి.మీ. ప్రయాణం చేయాల్సి వస్తోంది. వృత్తి పట్ల కూడా సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నాము." - ఉపాధ్యాయుడు

"19 జిల్లాల్లో మాత్రమే బదిలీలు చేసి 13 జిల్లాలను బ్లాక్​లో ఉంచారు. 13 జిల్లాల్లో బదిలీలు చేయాలని ఈ సంవత్సర కాలంలో ఎన్నోసార్లు ఆఫీసులు చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగాము. కానీ ఫలితం లేకపోయింది." - ఉపాధ్యాయురాలు

భార్యాభర్తలు ఒకే చోట పని చేసేలా బదిలీలకు డిమాండ్.. రణరంగంగా మారిన ఆందోళన..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.