లాక్‌డౌన్ తరువాత శ్రీవారిని అత్యధిక మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఒక్కరోజే 22,533 మంది స్వామి సేవలో తరించారు. గత కొన్ని రోజులుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్‌లు కలిగిన 13వేల మందితో పాటు, కల్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులు, శ్రీవాణి ట్రస్టు, బోర్డు సభ్యులు, వీఐపీ సిఫారసు లేఖలపై పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈనెలలో ఇప్పటికే 13వేలకు పైగా ఆన్‌లైన్ కల్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులు వాటి వినియోగం అనంతరం 90 రోజుల్లో దర్శించుకునే అవకాశం కల్పిస్తుండడం భక్తుల సంఖ్య పెరగడానికి కారణమైంది. హుండీ ఆదాయం రూ.1.34 కోట్లు వచ్చింది.
ఇదీ చూడండి. బెజవాడ చిన్నోడు.. డ్యాన్స్‌తో ఇరగదీస్తాడు!