ETV Bharat / state

పీలేరు నియోజకవర్గంలో నకిలీ వైద్యులు అరెస్ట్​ - అస్పత్రులను తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో డిప్యూటీ డీఎంహెచ్​ఓ ఆధ్వర్యంలో అసుపత్రులపై దాడులు నిర్వహించారు. ఎటువంటి విద్యార్హతలు లేని నకిలీ వైద్యులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Deputy DMHO who inspected the hospitals
అస్పత్రులను తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ
author img

By

Published : Feb 8, 2020, 12:15 PM IST

పీలేరు నియోజకవర్గంలో నకిలీ వైద్యులు అరెస్ట్​
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో నకిలీ వైద్యులు అధికమయ్యారు. ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా మొలలకు వైద్యం చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కలకడ మండల కేంద్రాల్లో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. వీరి దగ్గర చికిత్స చేయించుకున్న పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో నకిలీ వైద్యుల విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన మదనపల్లి డిప్యూటీ డీఎంహెచ్​ఓ డాక్టర్ లోకవర్ధన్ వైద్య సిబ్బందితో ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు. ఎటువంటి విద్యార్హతలు లేని నకిలీ వైద్యులను పోలీసులకు అప్పగించారు. లైసెన్స్ లేకుండా అస్పత్రి బోర్డులు పెట్టరాదన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.