చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయ సమీపంలోని స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 7 నెలల చిన్నారిని బయటకు విసిరేసిన తండ్రి... చికిత్స పొందుతూ బాలుడు మృతి