సరైన కారణాలు లేకుండా కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించే వారికి జరిమానాలు తప్పవని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, డీఆర్ మహల్ జంక్షన్, అన్నమయ్య సర్కిల్, ఎమ్మార్ పల్లి మొదలైన ప్రాంతాల్లో ఎస్పీ కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించారు.
కరోనా వైరస్ నివారణ కోసం ప్రజలు తమ బాధ్యతను గుర్తించుకోవాలని ఎస్పీ సూచించారు. కర్ఫ్యూ నిబంధనలు తెలియని వారి కోసం పోలీసులు ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్నారన్నారు. వైరస్ను నియంత్రించటంలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి.