కేరళ మంత్రి వర్గ కూర్పు దేశానికే ఆదర్శమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చాలాకాలం పనిచేసిన సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చారన్నారు. కేరళ రాష్ట్రంలో రెండు సార్లు కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదని, మంత్రివర్గంలో స్థానం కల్పించకూడదని సీపీఐ చేసిన తీర్మానాన్ని.. సీపీఎం కూడా పాటించడం అభినందనీయమన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవకు కొత్త వారిని ప్రోత్సహించాలని నారాయణ కోరారు.
ఇదీ చదవండి: కేరళ సీఎంగా విజయన్ ప్రమాణం