D raja met cpi Narayana : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. నారాయణని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పరామర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాయల చెరువుకు వెళ్లిన నారాయణ కాలు బెణికింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజా... చిత్తూరు జిల్లా నగరి మండలం ఐనంబాకం గ్రామంలో ఉన్న నారాయణను పరామర్శించారు.
రాజాతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ , సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, టి .జనార్దన్, పీఎల్ నరసింహులు, జె.విశ్వనాథ్ , కె.కుమార్ రెడ్డి, నగరి నియోజకవర్గం కార్యదర్శి కోదండయ్య, వేలన్ , విజయన్ ఉన్నారు.
ఇదీ చదవండి: CHANDRABABU FIRE ON CM JAGAN : ప్రత్యేక హోదాపై రాజీనామాలకు సిద్ధం..మీరు సిద్ధమా!: చంద్రబాబు