ETV Bharat / state

కరోనా కల్లోలం.. గరిష్ఠ స్థాయిని చేరుతున్న కొత్త కేసులు

రోజుకు వేల సంఖ్యలో కేసులు.. ఎటుచూసినా దయనీయ దృశ్యాలు. ఆస్పత్రుల్లో నిండుకున్న పడకలు..., చిత్తూరు జిల్లాలో కొవిడ్‌ సృష్టిస్తున్న కల్లోలమిది. బాధితుల్ని కాపాడేందుకు వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్నారు. గజం చోటు దొరికినా అక్కడే ఆక్సిజన్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు
covid situations in chittoor district
author img

By

Published : May 1, 2021, 7:23 AM IST

గరిష్ఠ స్థాయిని చేరుతున్న కొత్త కేసులు

చిత్తూరు జిల్లాపై కరోనా వైరస్‌ విరుచుకుపడుతోంది. శుక్రవారం ఒక్కరోజే.. 2,764 కేసులు వెలుగుచూశాయి. ఆరుగురిని మహమ్మారి బలిగొంది. ఇక జిల్లాలోని కొవిడ్‌ ఆస్పత్రుల వద్ద దృశ్యాలు హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. కొవిడ్‌తో బాధపడుతున్న తన భార్యను ఓ పెద్దాయన తిరుపతి స్విమ్స్‌కు తీసుకొచ్చారు. శ్వాస తీసుకోవడంలో సమస్యగా ఉందని.. తన భార్యను ఆస్పత్రిలో చేర్చుకోమని వైద్యసిబ్బందిని కోరారు. పడకలు ఖాళీ లేకపోవడంతో ఆమెను చేర్పించుకోలేకపోయారు వైద్యులు. ఆమెను అలా వదిలేయకుండా.. ఉన్నపాటి కొద్ది స్థలంలోనే నాలుగైదు కుర్చీలు వేసి ఆక్సిజన్ సిలిండర్లతో ప్రాణవాయువు అందించారు. జిల్లాలో కొవిడ్‌ దెబ్బకు ప్రజలు ఎలా విలవిల్లాడిపోతున్నారనే పరిస్థితికి ఇలాంటి ఎన్నో దృశ్యాలు అద్దంపడుతున్నాయి.

\జిల్లాలో అందుబాటులో ఉన్న వైద్యసదుపాయాలు.. రోజువారీ వెలుగుచూసిన కేసుల ముందు చాలడం లేదు. జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో మూడోవంతు తిరుపతిలోనే వస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి స్విమ్స్‌కి చెందిన పద్మావతి వైద్యకళాశాల కొవిడ్‌ ఆస్పత్రిలో 467, రుయా కొవిడ్‌ ఆస్పత్రిలో.. 890 పడకలు అందుబాటులో ఉంచారు. ఇవన్నీ పూర్తిగా రోగులతో నిండిపోయిన పరిస్థితి. తిరుపతిలో ఏర్పాటుచేసిన పలు ఐసోలేషన్‌ కేంద్రాల్లో 4వేల వరకు పడకలు అందుబాటులో ఉన్నాయి. కానీ.. రోజూ రెండు వేల చొప్పున కేసులు వెలుగుచూస్తుండటంతో.. అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

జిల్లాలో కొవిడ్‌ ఉద్ధృతిని తగ్గించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నామని యంత్రాంగం చెబుతోంది. పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండాలంటే.. ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

పరీక్షలు పెట్టకపోతే వారి భవిష్యత్తేమిటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.