ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో 80కి చేరిన పాజిటివ్ కేసులు

చిత్తూరు జిల్లాలో మరో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసులు సంఖ్య 80కి చేరింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 16 మంది చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు.

చిత్తూరు జిల్లాలో 80కి చేరిన పాజిటివ్ కేసులు
చిత్తూరు జిల్లాలో 80కి చేరిన పాజిటివ్ కేసులు
author img

By

Published : Apr 30, 2020, 1:48 PM IST

చిత్తూరు జిల్లాలో ఈరోజు నమోదైన 3 కేసులతో కలిపి పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరింది. రెండు శ్రీకాళహస్తిలో నమోదు కాగా... మరొకటి చిత్తూరులో పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకూ జిల్లాలో అత్యధికంగా శ్రీకాళహస్తిలో 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిని అధికారులు పూర్తిగా రెడ్​జోన్​గా ప్రకటించారు. ప్రతి ఆరు గంటలకు ఓసారి పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 16మంది కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తులు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఫలితంగా జిల్లాలో యాక్టివ్ కేసులు సంఖ్య 64కి చేరింది. కొత్తగా కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్​ను గుర్తించి వారిని క్వారంటైన్​కు తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి:

చిత్తూరులో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.