పురాణ ఇతిహాసమైన మహాభారత మహోత్సవాలను చిత్తూరు జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. 18 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ద్రౌపతి దేవి ఉత్సవాలను కరోనా కారణంగా ఒకరోజు కార్యక్రమాలతో ముగిశాయి. శ్రీరంగరాజపురం మండలంలోని అంకనపల్లెలోని శ్రీ కృష్ణ ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో ఈ ఏడాది ఉత్సవాలు ఒకే రోజుతోనే ముగిశాయి. ఇక్కడ వంద సంవత్సరాల క్రితం నుంచి ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడానికి ముందస్తుగా సమావేశమైన ఆలయ ఉత్సవ కమిటీ..,కరోనా కారణంగా ఉత్సవాన్ని ఒక్క రోజులో ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో అమ్మవారి పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వార్షిక ఉత్సవ ధ్వజారోహణం నిర్వహించారు. పాండవుల ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగించి ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు జరిపి మహాభారత ఉత్సవాలను ముగించారు.
ఇదీచదవండి భద్రకాళీ ఆలయానికి కరోనా కష్టాలు