చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా వచ్చినట్లు కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రకటించారు. చైన్నె కోయంబేడు కూరగాయల మార్కెట్ ద్వారా ఈ కేసులు సంక్రమించినట్లు కలెక్టర్ తెలిపారు. చిత్తూరు నగరంతో పాటు పలమనేరు, మదనపల్లె పట్టణాలలో 9 పాజిటివ్ కేసులు వచ్చినట్లు స్పష్టం చేశారు.
పాజిటివ్ కేసులు వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి లాక్ డౌన్ కఠినంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.