తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరచడం, పంపిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద చలువ పందిళ్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకుంటున్న భద్రతా చర్యలపై ఆరా తీశారు.
ఇదీ చదవండి: