చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఫిబ్రవరి 18 నుంచి పది రోజులు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త పరిశీలించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు రద్దీ దృష్ట్యా అవసరమైన ఏర్పాట్లు, అందరికీ స్వామి, అమ్మవార్ల దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణ, వాహన సేవలు, స్వామి, అమ్మవార్ల కల్యాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబందులు తలెత్తుకుండా సంబంధిత అధికారులు చేయాల్సిన ఏర్పాట్లు వివరించారు.
ఇదీ చూడండి: శ్రీకాళహస్తిలో సోమస్కంధ మూర్తి, అమ్మవార్లకు కైలసగిరి ప్రదక్షిణ