కొబ్బరి తోటలు సాగు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకొన్నది. ఆదాయం వేలలో వచ్చిన కష్టం కూడా అలాంటిదే. ఎందుకంటే వాటిని చెట్టుపై తెంపాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు అంతా శ్రమ అవసరం లేదు.ఎందుకంటే కొకనట్ క్లయంబర్ అనే యంత్రం వచ్చేసింది. దీనిని ఉపయోగించాలంటే శిక్షణ కూడా అవసరమే. ఇందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది చిత్తూరు జిల్లా కలిగిరి కృషి విజ్ఞానకేంద్రం. కొబ్బరి రైతులతో పాటుగా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాబీపేటలోని కొకనట్ పరిశోధన సంస్థ నిపుణులు వారికి మెలకువలు నేర్పిస్తున్నారు.యంత్రంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణాంతరం వారికి ధ్రువపత్రంతో పాటుగా రెండు వేల ఐదువందలు విలువచేసే యంత్రాన్ని ఉచితంగా ఇస్తున్నారు. దీనికి తోడుగా ప్రమాద బీమాను కూడా కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా శిక్షకులు సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోజుకు రెండు వందల చెట్లు ఎక్కి సులువుగా కొబ్బరి బొండాలను తెంపవచ్చు అంటున్నారు. నిరుద్యోగులకు ఈ శిక్షణతో ఉపాధి పొందవచ్చని తెలియచేశారు. రైతులు ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా కాయలను కోసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి