తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తిది ఏ మతమో సీఎం జగన్ చెప్పాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ అన్నారు. తిరుపతిలో భాజపా-జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన "అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో సామాజిక న్యాయం" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హిందూత్వం పేరు చెప్పుకుని గెలిచిన వారందరూ అన్యమత ప్రార్థన మందిరాల్లో హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని సునీల్ దేవ్‌ధర్ ఆరోపించారు. జీతాలు, పింఛన్లు సరిగ్గా ఇవ్వలేని సీఎం జగన్.. పాస్టర్లకు నిరాటంకంగా రూ.ఐదు వేలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రామతీర్థం, అంతర్వేది ఘటనల్లో నిందితులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారన్న దేవ్‌ధర్... సీబీఐ పేరు చెప్పి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.
ఇవీచదవండి.