చిత్తూరు జిల్లా పుంగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ డిపోను.. ఈ నెల 6న సీఎం జగన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని.. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. నూతన ఆర్టీసీ డిపోను మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
పుంగనూరులో ఏర్పాటు చేస్తున్న ఈ డిపో ద్వారా.. ఆరు మండలాల్లో.. 81 గ్రామాలకు 66 బస్సులు రానున్నాయని కలెక్టర్ తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. వర్చువల్ పద్దతిలో డిపో ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: