ETV Bharat / state

సౌదీలో భర్త మరణం.. మృతదేహం కోసం భార్య పడిగాపులు - సౌదీలో చిత్తూరు వాసి మృతి

పొట్టకూటి కోసం పరాయిదేశం వెళ్లిన చిత్తూరు వాసి గుండెపోటుతో గత నెలలో మరణించాడు. కుటుంబ పెద్దను పోగొట్టుకున్న విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి కనీసం కడసారి చూపు దక్కకుండా పోతోంది. నెలలు గడుస్తున్నా సౌదీలో మృతి చెందిన అమీన్ పీర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించలేదు.

సౌదీలో మృతి చెందిన భర్త మృతదేహం కోసం పడిగాపులు...!
author img

By

Published : Sep 24, 2019, 10:51 PM IST

సౌదీలో మృతి చెందిన భర్త మృతదేహం కోసం పడిగాపులు...!

పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లిన చిత్తూరు జిల్లా కొటాల గ్రామానికి చెందిన బోడిబుట్ట అమీన్ పీర్.. గత నెలలో గుండెపోటుతో మృతి చెందాడు. నెలలు గడుస్తున్నా... తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగించలేదని అతని భార్య హాతీమా ఆవేదన చెందుతుంది. అమీన్​ పీర్​కు రావాల్సిన ఆరు నెలల జీతం వచ్చేలా చూడాలని కోరింది. తమ కుటుంబానికి ఏ ఆధారం లేదని ఆవేదన చెందింది. తన భర్తను సౌదీకి పంపిన ఏజెంట్... ఇప్పుడు మృతదేహాన్ని అప్పగించకుండా, తాము రూ.15 లక్షలు డిమాండ్​ చేశామనే దుష్ప్రచారం చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. చిత్తూరు జిల్లా అధికారులు, విదేశాంగ అధికారులు స్పందించి తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగించాలని వేడుకుంది.

ఇదీ చదవండి:

ఆసుపత్రిలో ఈ చక్రాల కుర్చీపై వెళ్లింది దెయ్యమా?

Intro:ap_rjy_36_24_women_suside_avb_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:కాట్రేనికోన మండలం పల్లంలో వివాహిత ఆత్మహత్య

Conclusion:తూర్పు గోదావరి జిల్లా లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మల్లాడి వీర వేణి అనే గృహిణి ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న ఇదే గ్రామానికి చెందిన పాలెపు మాధవవర్మ తన కోరిక తీర్చమని విధిస్తుండడంతో 2 రోజుల క్రితం గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది మాధవరం కుటుంబ సభ్యులు కు మల్లాడి వీర వేణి భర్త ఆదినారాయణ కుటుంబాలు మధ్య ఘర్షణ తలెత్తడంతో మనస్థాపానికి గురై గ్రామాన్ని చేరి ప్రవహించే గోదారి ఉప్పుటేరులో ఆదివారం అర్ధరాత్రి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి శవ పంచనామా నిర్వహించారు గతంలోనూ మాధవవర్మ పలువురు మహిళలను ఈ విధంగా వేధించినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుతం అతను అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అతనిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు... నోట్.,:దీనికి సంబంధించిన విజువల్స్ ఈటీవీ వాట్సాప్ కు పంపబడినవి పరిశీలించగలరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.