Fire Accident in Ex Minister JC Diwakar Travels Buses in Anantapur District : అనంతపురంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. ఆర్టీసీ (RTC) బస్టాండ్ సమీపంలో ఉన్న జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మొత్తం నాలుగు బస్సులు ఉండగా ఒక బస్సు పూర్తిగా దగ్ధమవ్వగా మరో బస్సు పాక్షికంగా కాలింది. మంటలను గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
స్టీల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - ఎగిసిపడ్డ మంటలు
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ట్రావెల్స్ బస్సులను కొన్నింటిని నిలిపేశారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో బస్సులను నిలిపి ఉంచారు. బస్సుల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయింది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా లేక ఎవరైనా ఆకతాయిలు చేసిన పనే అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లోకపోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు.
మాదాపూర్‌లోని బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం - భారీ ఆస్తినష్టం