Ecological Knowledge Park in Sunnipenta of Kurnool District : ఉరుకుల పరుగుల జీవితంలో పచ్చని చెట్టుకింద కూర్చొని ప్రకృతి అందాలను తిలకించడం గొప్ప వరం. వారాంతరాల్లో, సెలవుల్లో పిల్లలను తీసుకొని పార్కుకు వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడమే కాకుండా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఎకొలాజికల్ ఉద్యానవనం మన కర్నూలు జిల్లాలో ఉందని మీకు తెలుసా!
సున్నిపెంటలోని ఎకొలాజికల్ పార్కు పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనిని 2011- 12లో ఏర్పాటు చేశారు. వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు భూమిపై చోటుచేసుకున్న పర్యావరణ మార్పులను కళ్లకుకట్టేలా దీనిని రూపొందించారు. ఇక్కడ డైనోసార్లు, వివిధ రకాల జంతువుల బొమ్మలు ఏర్పాటు చేసి వాటి జీవిత విశేషాలను వివరించారు. ఈ పార్కులో బిగ్ బ్యాంగ్ మొదలుకొని ఆదిమానవుడి జీవనం వరకు జీవ పరిణామ క్రమాన్ని తెలుసుకోవచ్చు.
పార్కు సంకెళ్లు వీడాయి- ఐదేళ్ల తరువాత ఆహ్లాదంగా సేదతీరుతున్న నగరవాసులు - REOPEN NELLORE Park
వీటితోపాటు ఇక్కడ ఆది మానవుల జీవన విధానాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పార్కులో ఎనీ టెర్రాయిన్ వెహికల్ (ఏ-టీవీ) కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కుకు స్థానికులు, వివిధ పాఠశాలల విద్యార్థులే కాకుండా శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులు, పర్యాటకులు పెద్దఎత్తున వచ్చి తిలకిస్తున్నారు.