ETV Bharat / state

ఫ్రెండ్ న్యూ ఇయర్ విషెస్​​ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య - INTER STUDENT DIED IN ANANTAPUR

అనంతపురం ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - అమ్మాయి మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం

Inter Student Died in Anantapur
Inter Student Died in Anantapur (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 11:31 AM IST

Inter Student Died in Anantapur : నేటి కాలంలో చాలా మంది యువత చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఒకరు, ప్రేమలో విఫలమయ్యామని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొందరు. ఇలా వివిధ కారణలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న వారిని విషాదంలోకి నెడుతున్నారు.

తాజాగా ఆ అమ్మాయి స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంది. అందరూ సంతోషంగా కలిసి ఆడిపాడారు. ఈ క్రమంలో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కానీ తన దగ్గరి స్నేహితురాలే తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పలేదని ఆ యువతి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

విడపనకల్లు మండలం పాల్తూరు చెందిన చిన్నతిప్పమ్మ (17) బళ్లారిరోడ్డులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్ చదువుతూ, అక్కడే వసతి గృహంలో ఉంటోంది. ఆమెకు అదే కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్న స్నేహితురాలు ఉంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉండేవారు. మంగళవారం రాత్రి హాస్టల్లో విద్యార్థులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొన్నారు. తన దగ్గరి స్నేహితురాలే తనకు శుభాకాంక్షలు తెలపలేదని చిన్నతిప్పమ్మ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున భోజనశాలలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

Anantapur Intermediate Student Death : గుర్తించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి తెలిపారు. వెంటనే చిన్నతిప్పమ్మ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వారు వెంటనే పోలీసులకు, యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంత గ్రామీణం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. అమ్మాయి మృతిపై ఆమె కుటుంబసభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్ట్​మార్టం గది ఎదుట విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ నేతలతో కలిసి ధర్నా చేపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నతిప్పమ్మ ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

రాత్రి వేళ ఒక్కొక్కరుగా పొలానికి - అనుమానంతో వెళ్లి చూసిన గ్రామస్థులు షాక్

మోసపోయానని ఒకరు - పరువు పోతుందని మరొకరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.