ETV Bharat / state

Arrest: చిత్తూరు జిల్లా పరువు హత్య కేసు: నిందితులు అరెస్టు - chittoor district honour killing accused arrest news

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో శుక్రవారం వెలుగుచూసిన పరువు హత్య కేసులో.. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

చిత్తూరు జిల్లా పరువు హత్య కేసు: నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

author img

By

Published : May 29, 2021, 11:44 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని తెలిసి సన్నిహితంగా ఉండడం చూసి ధన శేఖర్(22) అనే యువకుడిని యువతి తండ్రి కిరాతకంగా చంపాడు. యువకుడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పొలంలో పాతిపెట్టడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సున్నపు బాబు, యువతి తల్లి సుజాతతోపాటు వారి కుమార్తెను అరెస్ట్ చేసినట్లు పలమనేరు పోలీసులు తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.. హత్యలో వీరికి మరెవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పలమనేరు డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి: రహస్య ప్రాంతానికి ఆనందయ్య.. మందుపై నివేదికలు వచ్చేవరకు అంతేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.