ETV Bharat / state

పేకాట నా జీవితాన్ని నాశనం చేసింది.. ఇక వదిలేస్తా..!

పేకాట అంటే అతడికి ప్రాణం.. పదేళ్ల వయసు నుంచే పేక ముక్కలకు బానిసయ్యాడు. చదివింది ఆరో తరగతే..కానీ అతడి నైపుణ్యం ముందు ఎంతటి వారైనా తలొగ్గాల్సిందే. అంతేకాదు తన టాలెంట్​తో లక్షల రూపాయలు సంపాదించాడు. కానీ ఉన్నట్టుండి అతనిలో మార్పు మొదలైంది. ఇప్పుడు పేకాట వదిలేస్తానని చెబుతున్న ఆ యువకుడు... అవయవ దానానికీ సిద్ధమయ్యాడు. ఎందుకో తెలుసా?

chittoor young-man-ready-for-organ-donation-request to joint collector in SPANDANA
author img

By

Published : Oct 30, 2019, 2:23 PM IST

Updated : Oct 30, 2019, 2:50 PM IST

చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన బావాజీ అనే యువకుడు (24) పదేళ్ల వయస్సులోనే పేకాటకు బానిసయ్యాడు. అతని జీవితమే పేకాట అనేంత స్థాయికి వెళ్లాడు. పేకముక్కల్లో ఏ అంకె చెప్పినా.. కార్డును చూడకుండా తీసి ఇవ్వగలిగేంత ప్రావీణ్యం సంపాదించాడు. ఒక్కో పేక ముక్క అంకెను, అక్షరాన్ని చూడకుండానే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. అలాంటి వ్యక్తిలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. పేకాటపై విరక్తి కలిగింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే తన శరీర అవయవాలను దానం చేయటానికి సిద్ధమని స్పందన కార్యక్రమంలో జిల్లా సబ్​ కలెక్టర్​కు విజ్ఞప్తి చేశాడు.

పేకాటలో ఇక మోసం చేయలేనని.. అందుకే పది మందికి ఉపయోగపడేలా అవయవాలను దానం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అతని విన్నపంపై స్పందించిన అధికారులు... బావాజీ తల్లిదండ్రులను పిలిపిస్తామన్నారు. వారితో కౌన్సిలింగ్ లో మాట్లాడుతామని, అతని మానసిక పరిస్థితిని పరిశీలిస్తామని చెప్పారు.

ఇక పేకాట మానేస్తా.'.స్పందన'లో అర్జీ

ఇదీ చదవండి:

మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డి అరెస్ట్!

Intro:పేక ముక్కల్లో సునాయాసంగా నెంబర్ గుర్తింపు

Body:పేకాట లో యువకుని ప్రతిభ

Conclusion:100 పేకముక్కలు ఉన్న అందులో ఒకటి ఏ నెంబరు చూడకుండా చెప్ప గలడు ఒక యువకుడు చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కేంద్రానికి చెందిన బావాజీ కి 24 సంవత్సరాలు వయస్సు గత 14 సంవత్సరాలుగా ఇతను అను పేకాట కే అంకితమయ్యాడు ఇదే అతని జీవితమని ప్రేమించాడు పేకాట లో తన కున్న ప్రతిభను చాటుకున్నాడు వందల సంఖ్యలో లో కేక ముక్కలు ఉన్న అందులో ఏదో ఒక పేక ముక్క ను తీసుకొని అది ఏ నెంబరు చెప్పగలడు అయితే పేకాట పై విరక్తి చెందిన ఆ యువకుడు పదిమందికి ఉపయోగపడే కార్యక్రమం మనం చేస్తానని చెప్పాడు అధికారులు ప్రభుత్వం అనుమతి ఇస్తే శరీర అవయవాలను దానం చేయడానికి కూడా అ వెనుకాడబోనని చెప్పాడు తన మనసులోని మాటలను మదనపల్లె ఉప పాలనాధికారి చేకూరి కీర్తి వివరించారు ఆమె కూడా ఇతని మాటలు విని ఆశ్చర్యానికి గురయ్యారు వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ పెంచి అతని మానసిక పరిస్థితిని పరిశీలిస్తామన్నారు
బై టూ బాబాజీ
బై టు కీర్తి చేకూరి ఉప పాలనాధికారి మదనపల్లి
Last Updated : Oct 30, 2019, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.