ETV Bharat / state

'గురుకుల పాఠశాలలో గురువుగా మారిన జిల్లా కలెక్టర్' - gangadhara nellore

ఆసక్తితోనే అభ్యసన సాధ్యం. సాధించాలన్న ఆసక్తికి సరైన అభ్యసన తోడైతే విద్యార్థులకు విజయం దానంతట అదే తోడవుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అన్నారు. పాలనాధికారి రాత్రి నిద్ర కార్యక్రమంలో భాగంగా గంగాధర నెల్లూరులోని బాలికల గురుకుల పాఠశాలలో బస చేశారు.

'గురుకుల పాఠశాలలో గురువుగా మారిన జిల్లా కలెక్టర్'
author img

By

Published : Jul 6, 2019, 7:25 AM IST

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాలనాధికారి రాత్రి నిద్ర కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడే బస చేశారు. పాఠశాల బాలికలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా అవతారమెత్తి ... విద్యార్థినుల కాసేపు బోధించారు. అనంతరం ... వసతి గృహం లోనే రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.

'గురుకుల పాఠశాలలో గురువుగా మారిన జిల్లా కలెక్టర్'

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాలనాధికారి రాత్రి నిద్ర కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడే బస చేశారు. పాఠశాల బాలికలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా అవతారమెత్తి ... విద్యార్థినుల కాసేపు బోధించారు. అనంతరం ... వసతి గృహం లోనే రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.

'గురుకుల పాఠశాలలో గురువుగా మారిన జిల్లా కలెక్టర్'
Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు .దీంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. సామాన్య భక్తులకు దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.


Body:చిన్న వెంకన్న కొలువైన ద్వారకాతిరుమల శేషాచల పర్వతం శనివారం భక్తులతో నిండిపోయింది. భక్తుల గోవింద నామస్మరణలతో, వేద మంత్రాలతో మార్మోగింది. శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు, పాఠశాలల సెలవులకు చివరి శనివారం కావడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్షేత్ర పరిసరాలు కిక్కిరిశాయి. ఉదయం నుంచే దర్శన క్యూలలో, ప్రసాదాల కౌంటర్ వద్ద ,కేశఖండన శాలలో భక్తులు బారులు తీరారు .ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు వస్తూనే ఉన్నారు .ఈ సందర్భంగా శ్రీవారి దర్శన క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి .దీంతో భక్తులు క్యూ కాంప్లెక్స్ బయట బారులుతీరారు .సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. అయితే క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో భక్తులు క్యూలో నిలబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు భక్తులకు సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా భక్తులు ఎండలో మల మల మాడారు .అలాగే రద్దీగా ఉన్న కొన్ని ప్రదేశాల్లో భక్తులకు సక్రమంగా తాగునీరు అందించకపోవడంతో దాహార్తితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు .దీంతో వారు అసహనం వ్యక్తం చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం అధికారులు అల్పాహారాన్ని ,చిన్నారులకు పాలు అందజేశారు .దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 45 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో రావడంతో వారిని కంట్రోల్ చేసేందుకు అధికారులు తలమునకలయ్యారు. ద్వారకాతిరుమల యస్ ఐ ఎం. సూర్య భగవాన్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు .


Conclusion:ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.