తన దుకాణంలో 'చైనా వస్తువులు అమ్మబడవు' అంటూ బ్యానర్ కట్టి స్ఫూర్తిని చాటాడు ఓ యువకుడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలోని గుండుబావి ఎదురుగా ఓ యువకుడు పెయింట్, ఎలక్ట్రికల్, హార్డ్ వేర్ దుకాణం నడుపుతున్నాడు. సరిహద్దుల్లో చైనా కారణంగా మన జవాన్లు వీర మరణం పొందిన నేపథ్యంలో దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలనే నినాదం ఊపందుకుంది.
దీంతో తన షాపులో ఆ దేశ వస్తువులు విక్రయించడం ఆపేశాడు. మరింత మందికి స్ఫూర్తినిచ్చే ఉద్దేశంతో తన దుకాణం ఎదుట 'ఇక్కడ చైనా వస్తువులు అమ్మబడవు' అని రాసి ఉన్న బ్యానర్ ఏర్పాటుచేశారు.
ఇవీ చదవండి...