సినీ, రాజకీయరంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శివప్రసాద్ మరణం పార్టీకి తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా ఐతేపల్లిలోని శివప్రసాద్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం శివప్రసాద్ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా వెనుకబడిన తరగతుల కోసం శ్రమించిన వ్యక్తి అని కొనియాడారు.
ఇదీ చదవండి : విచారణకు హాజరుకాని ముఖ్యమంత్రి జగన్.. ఎందుకంటే..!