తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. బొజ్జలకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో ఇటీవల గొంతు సంబంధిత సమస్యకు శస్త్ర చికిత్స చేశారు.
సోమవారం ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు..‘గోపాల్ ధైర్యంగా ఉండు’ అంటూ పలకరించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం బొజ్జల తనయుడు సుధీర్‌రెడ్డి, సతీమణి బృందమ్మతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: