'అవసరమైన మందులు అందుబాటులో ఉంచటంతో పాటు కొవిడ్ పరీక్ష కిట్లు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ పడకలు, పెంచాలి. శాంతిపురం మండలం ఎన్ఏసీ సెంటర్ లో 200 పడకల కొవిడ్ కేంద్రాన్ని సిద్ధం చేయాలి. అర్హులందరికీ రెండో దశ వ్యాక్సిన్ ఇవ్వటంతో పాటు కుప్పం ఏరియా ఆసుపత్రిలో 10 వెంటిలేటర్ పడకలు, 50 వరకూ ఆక్సిజన్ పడకల్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలి. పీఈఎస్ ఆసుపత్రితో పాటు ఇతర ఏరియా ఆసుపత్రుల్లో 150 పడకలు, ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉంచాలి. నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలి. అన్ని గ్రామపంచాయితీలు, మునిసిపాలిటీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. కొవిడ్ పై ప్రజలలో విశ్వాసాన్ని పెంచేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి.' అని చంద్రబాబు లేఖ ద్వారా కలెక్టర్ హరినారాయణన్ కోరారు.
ఇదీ చదవండి: ఆస్పత్రుల్లో జనాలు.. ఆటవిడుపులో నేతలు!