ETV Bharat / state

కడప నుంచి ఇసుక దిగుమతి నిలిపివేత! - Import of Sand from Kadapa

ఇసుక ధర దిగిరానుంది. కడప జిల్లా నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటున్న క్రమంలో రవాణా భారం పెరిగింది. దీంతో ఇసుకను అధిక ధరకు అమ్ముతున్నారు. కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు ఇసుక సేకరణ నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.

Sand
Sand
author img

By

Published : Jun 19, 2020, 6:42 AM IST

తిరుపతి పరిసరాల్లో వినియోగదారులకు ఇసుక ధర తగ్గనుంది. కడప జిల్లా నుంచి దిగుమతి చేసుకోవడంతో రవాణా భారం పెరిగిన క్రమంలో టన్ను ఇసుక రూ.860 వరకు చెల్లించాల్సి వచ్చేది. ఇటీవల ఇసుక విధానంలో ఉన్నతాధికారులు మార్పులు తీసుకువచ్చారు. కడప జిల్లా నుంచి ఇసుక సేకరణ నిలిపివేయాలని నిర్ణయించారు. తిరుపతి నుంచి 105 కి.మీ దూరం వెళ్లి ఇసుక తీసుకురావడంతో రవాణా భారంతో పాటు జిల్లా ఆదాయానికి గండి పడుతున్నట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోని వనరులు వినియోగించుకోవడం ద్వారా సీనరేజ్‌ రూపంలో వచ్చే పన్నులు జిల్లాకు వర్తిస్తాయనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం నాగలాపురంలోని రీచ్‌ నుంచి ఇసుకను రేణిగుంట సమీపంలోని గాజులమండ్యం స్టాక్‌ పాయింట్‌కు తరలిస్తున్నారు. కడప నుంచి సేకరించిన నిల్వల విక్రయం పూర్తి అయిన అనంతరం టన్ను ఇసుకను రూ.600 వంతున విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.

దూరం నుంచి సేకరణ ఎందుకో..

చిత్తూరు జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో ఉండగా కడప జిల్లా నుంచి సేకరించాలనే నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సీనరేజ్‌ పన్నులు జిల్లాకు వర్తించే అవకాశం లేకపోవడం, రవాణా దూరంతో వినియోగదారులపై భారం పడడం తదితర నష్టాలను తెలుసుకోకుండా ఇంత వరకు వ్యవహారం సాగించారు. దగ్గర ఉన్న రీచ్‌ను వదిలిపెట్టి పొరుగు జిల్లాపై ఆధారపడడం వెనుక మతలబు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'వచ్చే ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.