ETV Bharat / state

తిరుపతిలో కేంద్ర బృందం..'నివర్' నష్టంపై అంచనా - నివర్ న్యూస్

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం తిరుపతికి చేరుకుంది. తుపాను కారణంగా 5 వేల 342 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్ర బృందానికి వివరించామని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి తెలిపారు.

తిరుపతి చేరుకున్న కేంద్ర బృందం
తిరుపతి చేరుకున్న కేంద్ర బృందం
author img

By

Published : Dec 17, 2020, 5:14 PM IST

నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం తిరుపతికి చేరుకుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలోని బృందం.. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్​లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో తుపాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా రాష్ట్ర అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.

అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి...తుపాను కారణంగా 5 వేల 342 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్ర బృందానికి వివరించామన్నారు. మరో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్ర బృందాన్ని కోరినట్లు వెల్లడించారు. నాలుగు జిల్లాల్లో పర్యటన అనంతరం..శుక్రవారం తిరుపతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర బృందం సమావేశం కానుందని ఉషారాణి తెలిపారు.

ఇదీచదవండి

ఏడాదిగా అలుపెరగని పోరాటం....అమరావతే నినాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.