ETV Bharat / state

వైకాపా రెబల్​ అభ్యర్థులపై కేసులు.. అనుచరుల ఇళ్లలో సోదాలు - రెబల్​ సర్పంచ్​ అభ్యర్థులపై పోలీసుల కేసులు

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని దుబ్బిగాని పల్లి, కోళ్లబైలు వైకాపా రెబల్​ అభ్యర్థులపై పోలీసులు కేసులు నమోదుచేశారు.

case filed on ysrcp rebel candidates in chittoor district
వైకాపా రెబల్​ అభ్యర్థులపై కేసులు.. అనుచరుల ఇళ్లలో సోదాలు
author img

By

Published : Feb 10, 2021, 9:12 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో వైకాపా నాయకుల మధ్య వర్గపోరు నెలకొంది. పోలీస్ స్టేషన్ వరకూ చేరిన ఈ పంచాయితీలో ఇద్దరు వైకాపా నేతలు, పంచాయతీ ఎన్నికల అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయి. దుబ్బిగాని పల్లి పంచాయతీ రెబల్ అభ్యర్థి మద్యం పంపిణీ చేస్తున్నాడని, కోళ్లబైలు రెబల్ అభ్యర్థి చికెన్ పంపిణీ చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు.

వారి అనుచరులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకు దిగిన గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి ఆనంద్ రెడ్డి.. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తమను అణగదొక్కాలని పోలీసులతో సోదాలు చేయిస్తున్నారంటూ ఆరోపించారు. తమ అనుచరులైన మగ్గం కార్మికుల ఇళ్లల్లో అనవసరపు సోదాలు చేయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:

సామాజిక మాధ్యమాల్లో గీత దాటితే కేసులే: అర్బన్ ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.